మోదికి అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేసిన అమెరికా

96

భారత ప్రధాని నరేంద్రమోదీకి అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో అత్యున్నత సైనిక గౌరవాలలో ఒకటైన లెజియన్ ఆఫ్ మెరిట్ అవార్డుకు నరేంద్ర మోదీని ఎంపిక చేశారు అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. ట్రంప్ తరఫున చీఫ్ కమాండర్ లెజియన్ ఆఫ్ మెరిట్‌ను సోమవారం అందజేశారు.
ప్రధాని మోదీ తరఫున అమెరికా భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు దీనిని అందుకున్నారు. ప్రధానమంత్రిగా మోదీ చేసిన గొప్ప సేవకు ఈ అవార్డు ప్రదానం చేస్తున్నట్లు అమెరికా పేర్కొంది.

ఇక సోమవారం ఇదే కార్యక్రమంలో, లెజియన్ ఆఫ్ మెరిట్, డిగ్రీ చీఫ్ కమాండర్.. ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ , జపాన్ మాజీ ప్రధాని షింజో అబేలకు కూడా ప్రదానం చేశారు. కాగా ట్రంప్ అధికారంలో ఉండగా ఇంతకుముందు సెప్టెంబర్ 18 న కువైట్ అమీర్ షేక్ సబా అల్-అహ్మద్ అల్-జాబెర్ అల్-సబాకు ప్రదానం చేశారు. దీనికి ముందు, 1991 లో చివరిసారిగా ఈ అవార్డు ప్రదానం జరిగింది. ఈ పతకాన్ని చాలా అరుదుగా ప్రదానం చేస్తారు.. దీనిని అమెరికా అధ్యక్షుడు మాత్రమే ప్రదానం చేస్తారు.. సాధారణంగా దేశాధినేతలు లేదా ప్రభుత్వ పెద్దలను మాత్రమే అవార్డుకు ఎంపిక చేస్తారు.