వారం రోజుల్లో యువ‌తి పెళ్లి.. ఇంతలోనే దారుణం!

60

వారం రోజుల్లో పెళ్లి, ఇంట్లో పెళ్లి పనులు మొదలయ్యాయి. ఇంతలో ఎక్కడినుంచి వచ్చారో తెలియదు.. నిద్రిస్తున్న యువతిపై గురువారం తెల్ల‌వారు జామున‌, 2 గంట‌ల స‌మ‌యంలో పెట్రోల్ పోసి నిప్పంటించారు. పెళ్లి ఇంట్లో మృత్యు కేకలు వినిపించాయి. వెంటనే గమనించిన తల్లిదండ్రులు మంటలు ఆర్పారు. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు..

ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని గట్టుకొండపల్లి గ్రామంలో సుమతి అనే యువతి ఆరుబైట వరండాలో నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోల్ పోసి నిప్పటించారు.. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం యువతి మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు

వారం రోజుల్లో యువ‌తి పెళ్లి.. ఇంతలోనే దారుణం!