లిస్టింగ్ అవ్వని ప్రభుత్వ పిటిషన్.. ఈ -వాచ్ యాప్ పై విచారణ రేపే

90

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అందుబాటులోకి తెచ్చిన ఈ -వాచ్ యాప్ నకు వ్యతిరేకంగా వైసీపీ ప్రభుత్వం హైకోర్టులో బుధవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ ఇవాళ విచారణకు వస్తుందనుకున్నా అనివార్యకారణాల వలన విచారణ రేపటికి వాయిదా పడినట్టు తెలుస్తోంది.

హైకోర్టులో ఈ పిటిషన్ ఇవాళ లిస్టింగ్ అవ్వలేదు దాంతో రేపు విచారణ జరగనుందని సమాచారం. ఇదిలావుంటే ఈ యాప్ ను ఎస్ఈసి ప్రైవేట్ గా ఎందుకు తయారు చేయించాల్సి వచ్చిందని వైసీపీ ప్రశ్నిస్తోంది. అంతేకాదు దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటోంది. ఈ క్రమంలోనే యాప్ ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.