కొడుకుని కిడ్నాప్ చేస్తామంటు ఎంఐఎం ఎమ్మెల్యేకు ఫోన్ కాల్

266

రూ. 50 లక్షలు ఇవ్వండి లేదంటే నీ కొడుకుని కిడ్నాప్ చేస్తామంటూ కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొయినుద్దీన్ కు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేశారు. ఆందోళన చెందిన ఎమ్మెల్యే బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. టోలీచౌకీ సమీపంలోని హకీంపేట్‌లో నివసించే ఎమ్మెల్యే కౌసర్‌ గత నెల 28వ తేదీన హైదరాబాద్‌ నుంచి సిద్దిపేటకు వెళుతున్నాడు.

ఈ సమయంలోనే 9102563387 నెంబర్ నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. రూ.50 లక్షలు ఇవ్వాలని, లేకపోతే చిన్నకొడుకు జాఫర్‌ను కిడ్నాప్‌ చేస్తామంటూ హెచ్చరించి నిందితుడు ఫోన్‌ డిస్కనెక్ట్‌ చేశాడు. ఎన్నిసార్లు తిరిగి ఆ నెంబర్ కు కాల్ చేసిన రెస్పాన్స్ లేదు. దింతో ఆందోళన చెందిన ఎమ్మెల్యే వెనక్కి తిరిగి వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

కొడుకుని కిడ్నాప్ చేస్తామంటు ఎంఐఎం ఎమ్మెల్యేకు ఫోన్ కాల్