టీడీపీ అభ్యర్థి వాణిపై దుండగుల దాడి

241

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికలు పూర్తి కాకముందే, మునిసిపల్ ఎన్నికల హడావిడి మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రచారం మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే విజయవాడ నగరంలోని కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మూడో డివిజన్ టీడీపీ అభ్యర్థి వాణి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా ఆమెపై దుండగులు దాడి చేశారు. వాణితోపాటు ఆమె కొడుకుపై దాడి చేసి ఇంట్లో సామానులు ధ్వంసం చేశారు. అవినాష్‌కు వ్యతిరేకంగా పోటీ చేస్తే ఊరుకోం అంటూ హెచ్చరించారు.

అయితే ఈ ఘటనపై వాని మీడియాతో మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలే తమపై దాడి చేశారని ఆరోపించారు. కాగా ఈ దాడిలో ఆమె వస్త్రాలు చినిగిపోయాయి. 60ఏళ్ల మహిళ అని కూడా చూడకుండా కొడతారా? అంటూ ఆమె వాపోయారు. పోలీసులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఏమైనా ఊరకుక్కల బెదిరింపులకు భయపడేదిలేదని అన్నారు. దాడి ఘటనపై పోలీసులు విచారణ ప్రారంభించారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. దాడికి గల కారణాలను తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు

టీడీపీ అభ్యర్థి వాణిపై దుండగుల దాడి