కర్నూలుకు హైకోర్టు తరలింపుపై కేంద్ర న్యాయశాఖమంత్రి సమాధానం

152

ఏపీహైకోర్టు తరలింపుపై రాజ్యసభలో ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. హైకోర్టుతో ఏపీప్రభుత్వం సంప్రదింపుల తరువాతే తరలింపుపై నిర్ణయం ఉంటుందని చెప్పారు. కోర్టు తరలింపుకు ఎలాంటి గడువు లేదని అన్నారు. అలాగే ఈ వ్యవహారం ప్రస్తుతం న్యాయస్థానాల పరిధిలో ఉందని చెప్పారు.

కాగా హైకోర్టును కర్నూలుకు తరలించాలని గతేడాది సీఎం జగన్ ప్రతిపాదన చేశారని సమాధానం చెప్పిన మంత్రి.. తరలింపుపై ఏపీప్రభుత్వం తోపాటు హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని అన్నారు. హైకోర్టు పరిపాలనా బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని.. అందువల్ల హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని స్పష్టం చేశారు.