UGC NET : యూజీసీ – నెట్ పరీక్ష తేదీలు విడుదల

156

యూజీసీ – నెట్ 2021 పరీక్ష తేదీలను కేంద్ర విద్యాశాఖామంత్రి రమేష్ పోఖ్రియాల్ వెల్లడించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించే ఈ పరీక్షలు మే 2 నుంచి ప్రారంభం కానున్నట్లు ట్విట్టర్ ద్వారా తెలిపారు పోఖ్రియాల్. NTA లో అర్హత సాధిస్తే జూనియర్‌ రీసెర్చి ఫెలోషిప్‌, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడుతుంది. ఇక ఈ పరీక్షలు రాసేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడతారు.

దేశ వ్యాప్తంగా జరిగే ఈ పరీక్షలకు అన్ని రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో సెంటర్లు ఏర్పాటు చేస్తారు. ఇక పరీక్ష తేదీలను ఒకసారి పరిశీలిస్తే మే 2,3,4,5,6,7,10,11,12,14 మరియు 17 తేదీల్లో జరుగుతాయని కేంద్రమంత్రి వెల్లడించారు. ఈ పరీక్ష రాసే అభ్యర్థులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. నెట్ పరీక్ష ఆన్లైన్ లో జరుగుతుంది. ఈ పరీక్ష కోసం ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వరకు అభ్యర్థులు ugcnet.nta.nic.inలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

UGC NET : యూజీసీ – నెట్ పరీక్ష తేదీలు విడుదల