Uday Kiran Wife Vishita: ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?

404

ఉదయ్ కిరణ్… ఇండస్ట్రీకి వచ్చి మెరుపు వేగంతో టాప్ హీరోగా ఎదిగి అదే స్పీడ్ తో కిందకు పడిపోయిన హీరో.. చిత్రం సినిమాతో తెలుగు చిత్రసీమకు పరిచయమైనా ఉదయ్.. ఆ తర్వాత మంచి హిట్స్ తో టాప్ హీరోల సరసన చేరారు.. వరుస విజయాలు అందుకున్నారు. అతడి మాట, నటనతో తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు. కానీ కెరియర్ డౌన్ ఫాల్ అవడం.. ఇతరత్రా కారణాలతో జీవితాన్నే ముగించేశాడు..

అయితే ఉదయ్ కిరణ్ మృతి చెంది ఏడేళ్లు గడుస్తున్నా ఇంకా వార్తల్లోనే ఉంటున్నారు. ఉదయ్ మృతిపై అనేక అనుమానాలు, అపోహలు. తాను ఆర్ధిక ఇబ్బదుల వలన మృతి చెందారని కొందరు అంటే, అంతమంచి నటుడికి ఆర్ధిక ఇబ్బందులు ఎందుకుంటాయని మరికొందరి అభిప్రాయం.. ఇక ఈ తరుణంలోనే ఉదయ్ అక్క శ్రీదేవి పలు సంచలన విషయాలు బయటపెట్టింది. ఉదయ్ కి ఆర్ధిక ఇబ్బందులు ఏమి లేవని తెలిపింది.

ఉదయ్ కోటీశ్వరుడని వివరించింది. కుటుంబ కలహాలతోనే ఉదయ్ బలవన్మరణానికి పాల్పడ్డాడని వివరించింది. తన భార్య విషితపైనే తమకు అనుమానాలున్నాయని సంచలన కామెంట్స్ చేసింది. అయితే వీటిపై ఉదయ్ కిరణ్ భార్య విషిత స్పందించింది లేదు. ఉదయ్ అంత్యక్రియలు అయిపోయి 11 రోజులు పూర్తైపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ రెండు కుటుంబాలు కలుసుకున్నది కూడా లేదని ఉదయ్ అక్క చెప్పింది. అసలు ఇప్పుడు ఉదయ్ భార్య విషిత ఏం చేస్తుంది..? ఎక్కడుంది అనేది చాలా మందికి ఆసక్తికరంగా మారిన ప్రశ్న.

Uday Kiran Wife Vishita: ఉదయ్ కిరణ్ భార్య విషిత గురించి ఈ నిజాలు మీకు తెలుసా..?