నేడు బాలాకోట్ బద్దలైన రోజు

258

పాకిస్థాన్ లోని బాలాకోట్ లో గల ఉగ్రస్థావరాలపై దాడి చేసి నేటికీ రెండేళ్లు.. 2019 ఫిబ్రవరి 26 తెల్లవారు జామున భారత వాయుసేన పాకిస్థాన్ లోని ఉగ్రస్థావరాలపై మెరుపు దాడులు చేసి 300 మంది ఉగ్రవాదులను మట్టుపెట్టింది.. ఈ దాడితో శత్రుదేశం వెన్నులో ఒణుకు పుట్టింది..

బాలాకోట్ దాడి చెయ్యడానికి గల కారణాలు

2019 ఫిబ్రవరి 14 తేదీన 78 వాహనాల్లో వెళ్తున్న సుమారు 2700 మంది crpf జవాన్లను టార్గెట్ గా చేసుకొని బాంబ్ దాడి చేసింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ . ఈ దాడిలో 40 మంది భారత సైనికులు అమరులయ్యారు. దేశం యావత్తు ముక్తకంఠంతో ఖండించింది. పాకిస్థాన్ మిత్రదేశం చైనా కూడా ఈ దాడిని ఖండించింది. 40 మంది జవాన్లు అమరులవడం యావత్ దేశాన్ని కలచివేసింది.. ప్రతి భారతీయుడి రక్తం మారిగోపోయిన రోజది.. ప్రతీకారం తీర్చుకోవాలని దేశ వ్యాప్తంగా ఉన్న ప్రజలు బలంగా కోరారు. పాక్ కు తగిన బుద్ది చెప్పాలని నినదించారు. అమరవీరుల త్యాగాల సాక్షిగా ప్రణామాలు చేసి భారత్ పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థలను లేకుండా చేస్తామని ప్రతిన భూనారు దేశ ప్రజలు..

దేశ యావత్తు ఏకమైనా వేళ ప్రధాని మోడీ… సైనికులకు స్వేచ్ఛనిచ్చాడు.. మీకు ఇష్టమైన చోట.. ఇష్టం వచ్చిన సమయంలో ప్రతీకారం తీర్చుకోవాలని తెలిపారు. దింతో భారత వాయుసేన ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమైంది. మిసైల్స్ నిండిన మిగ్ – 21 యుద్ధ విమానాలతో గగనతలంలోకి ఎగిరాయి. పాక్ సరిహద్దు దాటి బాలాకోట్ లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేశాయి.. శత్రువు నిద్రలోంచి లేవకముందే భారత్ మృత్యువును పరిచయం చేసింది. ఈ దాడిలో 300 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టింది భారత వాయుసేన..

టార్గెట్ పూర్తి చేసి వస్తున్న సమయంలో భారత వాయుసేన పాక్ లోకి ప్రవేశించిందని తెలియడంతో పాక్ వాయుసేన ఎఫ్ -16 యుద్ధ విమానాలను వేసుకొని బయలుదేరింది. అభినందన్ వర్ధమాన్ నడుపుతున్న మిగ్ – 21 విమానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు.. దింతో అత్యధిక వ్యవస్థ కలిగిన ఎఫ్ – 16 యుద్ధవిమానాని అభినందన్ కూల్చివేశాడు. దింతో పాక్ సైనికుడు పారాషూట్ సాయంతో కిందకు దిగాడు.. కమ్యూనికేషన్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో అభినందన్ నడుపుతున్న మిగ్ – 21 కూడా కూలిపోయింది..

అభినందన్ పారాషూట్ సాయంతో కిందకు దిగాడు. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ సోల్జర్ భారతీయ సోల్జర్ అనుకోని తీవ్రంగా దాడి చేశారు. దింతో అతడు తీవ్ర గాయాలపాలయ్యాడు. చివరికి పాక్ సోల్జర్ అని తెలుసుకొని ఆసుపత్రికి తరలిస్తారు. కానీ చికిత్స పొందుతూ మృతి చెందుతాడు.. ఇక అభినందన్ పాకిస్థాన్ భూ భాగంలో దిగి అక్కడ ప్రజలకు చిక్కాడు.. దింతో అతడిని సోల్జర్స్ కి అప్పగించారు. మూడు రోజుల తర్వాత భారత్ హెచ్చరికతో పాక్ అభినందన్ ను భారత్ కు అప్పగించింది. ఆ రోజు దేశ ప్రజల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. శత్రుదేశానికి వెళ్లి 300 మందిని మట్టుబెట్టి హీరోల భారత్ కు తిరిగి వచ్చాడు.

ఈ దాడితో పాకిస్థాన్ వెన్నులో ఒణుకు పుట్టింది. భారత్ సైన్యం దెబ్బకు కంగుతిన్న పాక్ ఆర్మీ సరిహద్దుల్లో తోకముడిచింది. ఇక ఉగ్రదాడులు కూడా చాలా వరకు తగ్గాయి. దేశ అంతర్గత భద్రతా కూడా మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి చెందింది.

పుల్వామా ఉగ్రదాడికి బాలాకోట్ సైనిక దాడి ప్రతీకారం. భారత్ తో పెట్టుకుంటే లాహోర్, రావుల్ పిండిలను కూడా పిండి చెయ్యగలమని శత్రుదేశానికి గట్టి హెచ్చరికల ఈ దాడి నిలిచింది.

నేడు బాలాకోట్ బద్దలైన రోజు