కొవ్వూరులో రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువతుల దుర్మరణం

56

పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువతులు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటన కొవ్వూరులో గురువారం ఉదయం జరిగింది. ఈరోజు ఉదయం కొవ్వూరుకు చెందిన ఇద్దరు యువతులు స్కూటీపై వెళుతున్నారు.. అయితే క్వారీకి చెందిన లారీ అతివేగంగా వచ్చి
స్కూటీని ఢీకొట్టింది.. దాంతో ఆ ఇద్దరు యువతులు అక్కడికక్కడే మరణించారు. స్కూటీని లారీ ఢీకొని వారిపై నుండి వెళ్లిపోవడంతో యువతుల శరీరాలు నుజ్జు నుజ్జు అయ్యాయి.

స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతి చెందిన యువతులు కొవ్వూరు 23వ వార్డుకు చెందిన ఈర్ని భార్గవి, తనూషగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మార్చురీకి తరలించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.