అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు

281

రెండు తెలుగు రాష్ట్రాలు రోజు రోజుకు అప్పుల్లో కూరుకు పోతున్నాయి, ఆదాయం తగ్గి వ్యయం పెరుగుతుండటంతో బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకుంటున్నాయి. ఈ బహిరంగ మార్కెట్ నుంచి అప్పులు తీసుకుంటున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా, తమిళనాడు రెండవ స్థానంలో ఉంది. ఇక ఆంధ్ర ప్రదేశ్ 4, తెలంగాణ 6వ స్థానంలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ బహిరంగ మార్కెట్ నుంచి 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ నెల వరకు ఏపీ రూ.44,250 కోట్లు, తెలంగాణ రూ.36,354 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించాయి. ఆంధ్రప్రదేశ్‌ సర్కార్‌ డిసెంబర్‌ 30 రోజుల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజుల పాటు చేబదుళ్లు, మూడు రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. తెలంగాణ ప్రభుత్వం కూడా 28 రోజుల పాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 20 రోజుల పాటు చేబదుళ్లు, 13 రోజుల పాటు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని వాడుకుంది.

నెలవారీగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు ఈ మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకుని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటాయి. డిసెంబర్‌ నాటికి ఏపీ ప్రభుత్వం గత ఏడాది 12 నెలల్లో తీసుకున్నదానికంటే 4.3 శాతం అధికంగా అప్పు చేయగా, తెలంగాణ ప్రభుత్వం గత 1.15 శాతం తక్కువ తీసుకుంది. ఇక ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలు పీకల్లోతు అప్పుల్లో కురుకుపోయినట్లు తెలుస్తుంది.. ఈ అప్పులపై కరోనా ప్రభావం గుదిబండలా పడటంతో ఒక్కసారిగా రెండు తెలుగు రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి దిగజారింది.

అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు