సాయం చేద్దామని వెళ్లి చనిపోయారు.

55

సాయం చేద్దామని వెళ్లిన ఇద్దరు వ్యక్తులు మంటల్లో కాలి చనిపోయారు. ఈ హృదయవిదారక ఘటన కృష్ణా జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లిలో చోటుచేసుకుంది. ఓ కంటైనర్ లారీలో మంటలు వచ్చాయి. అటుగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు లారీలో ఎవరైనా ఉన్నారేమో వారిని కాపాడుదాం అనే ఉద్దేశంతో లారిదగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకున్నారు.

దింతో కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మంటల్లో శరీరం సగం వరకు కాలిపోయింది. బైక్ పూర్తిగా అగ్నికి ఆహుతైంది. కాగా మంటలు వ్యాపించగానే లారీ డ్రైవర్ క్లినర్, లారీ దిగి పరుగులు తీశారు. ఇది తెలియక ఇద్దరు వ్యక్తులు లారీని పట్టుకొని ప్రాణాలు కోల్పోయారు. విషయం తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పారు, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, విద్యుత్ శాఖ అధికారులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు.

మృతి చెందిన ఇద్దరు మీర్జాపురంకు చెందిన చైనా బజార్ యజమాని పెనుమాక జ్యోతి బాబు, అతని స్నేహితుడు షేక్ మస్తాన్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

సాయం చేద్దామని వెళ్లి చనిపోయారు.