ట్విటర్‌ ట్రెండింగ్‌.. విక్రమ్‌ సినిమాకు 21 ఏళ్లు

79

విభిన్నమైన కథాంశం కలిగిన చిత్రాలను ఎంచుకోవడంలో నటుడు విక్రమ్‌ ముందు వరుసలో ఉంటాడు. అంతే కాదు అబ్దుత నటనతో అందరిని ఆకట్టుకుంటాడు. ఆనయ చేసిన విలక్షణ పాత్రలు అభిమానుల మదిలో మెదులుతూనే ఉంటాయి. ఇక విక్రమ్ నటనకు ఎవరైనా హ్యాట్సఫ్ చెప్పాల్సిందే. విలక్షణ నటుల్లో కమల్ హాసన్ ముందు వరుసలో ఉండగా, విక్రమ్ ఆ తర్వాత స్థానంలో ఉంటారు.

ప్రతీ సినిమాలోనూ ఓ డిఫెరెంట్ లుక్‌తో కనిపించేందుకు ప్రయత్నిస్తుంటాడు. ఇక అపరిచితుడు సినిమాతో నటనలోని తన విశ్వరూపాన్ని చూపించి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు విక్రమ్‌. అపరిచితుడు, జెమిని, సేతు, పితామగన్ లాంటి చిత్రాల్లో ఆయన నటన ప్రేక్షకులనే కాదు.. సినీ విమర్శకులను మెప్పించింది. కాగా తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా నిలిచిన సినిమా సేతు.. 1999 డిసెంబర్ 10 న విడుదలైన ఈ సినిమా భారీ విజయం అందుకుంది.

ఈ సినిమా విక్రమ్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డు అందుకుంది. లెజెండరీ డైరెక్టర్ బాల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో రికార్డులను క్రియేట్ చేసింది. ఇక ఈ సినిమాను తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో కూడా నిర్మించారు. తెలుగులో శేషు పేరుతొ రాజశేఖర్ హీరోగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా తమిళంలో తీసిన సేతు సినిమా విడుదలై నేటికి 21 వసంతలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విక్రమ్‌ అభిమానులు #21YearsOfEpicSETHU అనే హ్యష్‌ ట్యాగ్‌ను ట్విటర్‌లో ట్రెండ్‌ చేస్తున్నారు.