Twitter ban : 24 గంటల సమయమిచ్చిన భారత్

139

ట్విట్టర్ పిట్ట, ఆయా దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ట్విట్టర్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. బడా నేతలు స్పందించాలి అంటే ఎక్కువగా ట్విట్టర్ నే వాడుతుంటారు. సెలెబ్రెటీలు కూడా ట్విట్టర్ పిట్టను బాగానే వాడుతుంటారు. అయితే ఈ యాప్ ఆయ దేశ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవడంలేదనే విమర్శలు ఉన్నాయి. ఇప్పటికే పలు దేశాలు ట్విట్టర్ కు యాడ్స్ ఇవ్వడం మానేశాయి.

ఇదే తరహాలో భారత ప్రభుత్వం కూడా వ్యవహరించేలా కనిపిస్తుంది. కేంద్ర సమాచార సాంకేతిక శాఖ ఇచ్చిన నోటీసులను ట్విట్టర్ పట్టించుకోకపోగా, రైతు ఉద్యమానికి సంబంధించి రెచ్చగొట్టే ట్విట్లను తొలగించకుండా అంతే ఉంచుతుంది. అభ్యంతరకర ట్విట్లను గుర్తించి సమాచార సాంకేతిక శాఖ ట్విట్టర్ కు తెలిపింది. అయితే ట్విట్టర్ వీటిని తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవరించింది. దింతో కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలు ఉల్లంగిస్తే 24 గంటల్లో బ్యాన్ చేస్తామని తెలిపింది.

కాగా ప్రస్తుతం ట్విట్టర్ పీకల్లోతు కష్టాల్లో ఉంది. తొందరపడి ట్రంప్ అకౌంట్ బ్లాక్ చెయ్యడంతో 12 శాతం షేర్ వ్యాల్యూ కోల్పోయింది. ఇక భారత్ ఘాటు హెచ్చరికలతో షేర్ వ్యాల్యూ మరింత కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ట్విట్టర్ వ్యవహారశైలిని ఓ సారి పరిశీలిస్తే.. దేశలో జరుగుతున్న రైతు ఉద్యమానికి సంబంధించి విదేశీయులు ట్వీట్ చేస్తే వాటిని అలానే ఉంచుతుంది.. కానీ దానికి బదులుగా ఇండియన్ సెలెబ్రెటీలు బదులు ఇస్తే ఆ ట్విట్లు ట్విట్టర్ నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని తీసేస్తుంది.

గత రెండు రోజుల వ్యవధిలో భారత్ కు చెందిన చాలామంది సెలెబ్రెటీల ట్విట్లను తొలగించింది ట్విట్టర్. ట్విట్లు తొలగించబడిన జాబితాలో కంగనా రనౌత్ కూడా ఉన్నారు.

Twitter ban : 24 గంటల సమయమిచ్చిన భారత్