శ్రీవారి భక్తులకు అదనపు భారం

315

తిరుమల అలిపిరి టోల్ గేట్ చర్చిలు పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కనిష్ఠంగా 15 రూపాయలు, గరిష్ఠంగా 100 రూపాయలను టోల్ ఛార్జీ కింద వసూలు చేసేవారు. ఇప్పుడిది రెట్టింపైంది. కనిష్ఠ ఛార్జీ 50 రూపాయలు, గరిష్ఠ చార్జీ 200 రూపాయలకు పెరిగింది. ఇప్పటిదాకా అమల్లో ఉన్న టోల్ ఛార్జీల ప్రకారం.. భక్తులు రాకపోకలు సాగించే వ్యక్తిగత కారుపై 15 రూపాయల నామమాత్రపు ఛార్జీని వసూలు చేసేవారు. ఇప్పుడు 50 రూపాయలకు పెంచారు. టాక్సీపై 25 రూపాయలు, సొంత జీపుపై వచ్చే వారి నుంచి 30 రూపాయలను తీసుకునేవారు.

ఈ టోల్ భారం ఇప్పుడు తిరుమ‌లకు వ‌చ్చే ప్ర‌తి భ‌క్తుడిపై ప‌డ‌నుంది. ఇప్ప‌టికే అన్ని ర‌కాల రేట్లు పెంచి… కొండ‌పైకి వ‌చ్చేస‌రికే నిలువుదోపిడీ చేస్తున్నార‌ని, వ‌డ్డీ కాసుల వాడిక‌న్నా ఎక్కువ‌గా ర‌క‌ర‌కాల చార్జీల పేరిట జ‌నం సొమ్మును వ‌సూలు చేస్తున్నారని భ‌క్తులు మండిప‌డుతున్నారు. ఈ రేట్లు ఇలాగే పెంచితే కొన్నాళ్ల‌కు సామాన్యులకు తిరుమ‌ల వెంక‌న్న ద‌ర్శ‌నం ద‌క్క‌దేమోనంటూ మండిప‌డుతున్నారు.

శ్రీవారి భక్తులకు అదనపు భారం