క్రిస్మస్ వేడుకల్లో టీటీడీ మెంబర్.. రాజీనామాకు హిందూ సంఘాల డిమాండ్!

253

తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహరించే విధానాలు ఇటీవలికాలంలో వివాదాలకు కేరాఫ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బోర్డు మెంబర్‌గా ఉన్న వ్యక్తి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం ఇప్పుడు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. వైసీపీ ఎమ్మెల్యే మేడ మల్లిఖార్జున్ రెడ్డి, హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల వెంకన్న దేవస్థానంలోని బోర్డు సభ్యుడిగా ఉండి క్రిస్మస్ వేడుకల్లో ఎలా పాల్గొంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి హిందూ సంఘాలు.

కాగా ఇదేం మొదటి సారి కాదు.. ప్రతి ఏడాది ఇది పరిపాటిగా మారిపోతుంది. గతంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఓ వ్యక్తి క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనడం అప్పట్లో చర్చనీయాంశం అయ్యింది.

టీటీడీ సభ్యుల వ్యవహార శైలి హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ పలు హిందూ సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా బీజేపీ నేత రమేష్ నాయుడు ఇదే అంశంపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

కారుపై ఆర్ఎస్ఎస్ స్టిక్కర్ ఉంటే కొండపైకి వెళ్లనివ్వని టీటీడీ అధికారులు.. టీటీడీ మెంబర్‌గా ఉన్న వ్యక్తిని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొనేందుకు ఎలా అనుమతిచ్చారని ప్రశ్నించారు.

పవిత్ర తిరుమల దేవాస్థానం బోర్డు సభ్యులుగా ఉండి ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే వారిని వెంటనే బోర్డు సభ్యులుగా తొలగించాలని హిందు సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక మత విశ్వాసాలను దెబ్బతీసే అధికారం ఎవరికి లేదని, వెళ్ళాలి అనుకుంటే ఆ బోర్డు పదవిని వదిలేసి వెళ్లవచ్చని అన్నారు.

క్రిస్మస్ వేడుకల్లో టీటీడీ మెంబర్.. రాజీనామాకు హిందూ సంఘాల డిమాండ్!