టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు

248

తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా 2007 సంవత్సరంలో కళ్యాణమస్తు కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనికోసం భారీగా నిధులు కేటాయించారు. ఐతే ఈ కార్యక్రమం 2011 వరకు నిరాటంకంగా కొనసాగింది. మధ్యలో నిలిపివేశారు. ఇక ఈ ఏడాది తిరిగి పునఃప్రారంభం చేయనున్నారు. ఈ మేరకు ముహూర్తాలను ఖరారు చేశారు టీటీడీ అర్చకులు, లగ్నపత్రిక ముద్రించి స్వామివారి పాదాలవద్ద ఉంచారు. ఇక మే 28వ తేదీ అక్టోబర్ 30వ తేది, నవంబర్ 17వ తేదిలలో కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ చేశారు.

ఇక కళ్యాణమస్తు కార్యక్రమం నిర్వహించే ప్రాంతాలను పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ విషయాన్నీ టీటీడీ ఇఓ జవహర్ రెడ్డి తెలిపారు. కాగా ప్రతి ఏడాది టీటీడీ ఆదాయం రూ. 2 వేలకోట్లు వస్తుంది. ఈమేరకు ధార్మిక కార్యక్రమంతోపాటు అన్నదానాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అయితే టీటీడీ జరిపించే కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునే వారికీ రెండు గ్రాముల బంగారంతో మంగళసూత్రం, వస్త్రాలు, వధూవరులుతో పాటు 50 మందికి ఉచితంగా భోజనం సరఫరా చేసింది టిటిడి. ఇక ఈ కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా ప్రతి ఏడు ఐదు వేల నుంచి ఏడువేల జంటలు ఒక్కటవుతునాయి. కళ్యాణమస్తు కార్యక్రమంలో పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపుతారు వధువరులు.

టీటీడీ కళ్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తం ఖరారు