టీటీడీలో 3000 ఉద్యోగాలు? ఫ్యాక్ట్ చెక్!

137

సోషల్ మీడియా వలన ఎంత లాభం ఉందో.. అంతకు మించి నష్టం ఉంది. సోషల్ మీడియాలో రోజు లక్షల సంఖ్యలో పోస్టులు పెడుతుంటారు. అందులో నిజం ఎదో, అబద్దం ఎదో తెలియక సతమతమవుతుంటారు, ఒక్కోసారి డబ్బులు కూడా పోగొట్టుకుంటారు నెటిజన్లు. ఇలా తాజాగా సోషల్ మీడియాలో గుర్తు తెలియని వ్యక్తులు నిరుద్యోగులను ఆకర్షించే విధంగా ఓ పోస్ట్ పెట్టారు. టీటీడీలో 3000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ పడిందని అప్పికేషన్ తేదీ దగ్గరకు వచ్చిందని, త్వరగా అప్లై చేసుకోవాలని ఓ అనామక వ్యక్తి పోస్ట్ చేశారు.

అది నిజమనుకొని ఆ ఫేక్ వెబ్ సైట్ లోకి వెళ్లి చాలామంది నిరుద్యోగులు అప్లికేషన్ చేశారు. దీనికోసం కొంతమొత్తంలో ఫీజు కూడా కట్టారు. ఇక మరికొందరు తమకు తెలిసిన లీడర్లతో రికమండేషన్ చేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ తరుణంలోనే విషయం టీటీడీ అధికారుల దృష్టికి వచ్చింది. దింతో వారు దీనిపై స్పందించారు. టీటీడీ ఎటువంటి నోటిఫికేషన్ విడుదల చెయ్యలేదని వివరణ ఇచ్చారు. దింతో అప్లై చేసిన అభ్యర్థులు బిత్తరపోయారు.

తమ డబ్బు పోయిందంటూ లబోదిబో అంటున్నారు. నోటిఫికేషన్ వేస్తె టీటీడీ నుంచి అధికారిక ప్రకటన వస్తుందని ఎవరు కూడా మోసపోవద్దని, ఖాళీలను భర్తీ చేసే సమయంలో ప్రెస్ నోట్ ఇస్తామని అది అన్ని ప్రధాన పత్రికల్లో ప్రింట్ అవుతుందని ఎవరు మోసపోకూడదని తెలిపారు. ఇటువంటివి ఎక్కడైనా కనిపిస్తే అప్లై చేసే ముందు టీటీడీ హెల్ప్ లైన్ కి ఫోన్ చేసి తెలుసుకోవాలని సూచించారు.

టీటీడీలో 3000 ఉద్యోగాలు? ఫ్యాక్ట్ చెక్!