బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ నేతలు దాడి

192

పశ్చిమ బెంగాల్ లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. రాజకీయ పార్టీల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు కాకుండా దాడులు, ప్రతిదాడులు మొదలయ్యాయి. గత కొద్దీ రోజులుగా బీజేపీ నేతలను, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ తృణమూల్ నేతలు దాడులకు పాల్పడుతున్నారు. ఇక ఇవాళ హౌరాలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ కార్యకర్తలపై తృణములు నేతలు గుంపుగా వచ్చి దాడి చేశారు. ఈ దాడిలో పలువురు బీజేపీ నేతలకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.

దాడిలో మోటర్ సైకిళ్లకు నిప్పుపెట్టారు. ఇక ఈ దాడిపై బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా హింసా రాజకీయాలను కోరుకుంటే తాము అందుకు తగినట్టుగానే వారి పద్ధతిలోనే తగిన సమాధానం చెబుతామని హౌరా బీజేపీ నేతలు హెచ్చరించారు. కాగా, బీజేపీ ర్యాలీపై దాడి నేపథ్యంలో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఇదంతా పోలీసుల ముందే జరిగిందని ఆరోపిస్తున్నారు బీజేపీ నేతలు.

బీజేపీ కార్యకర్తలపై తృణమూల్ నేతలు దాడి