వైట్ హౌస్ లో ట్రంప్ కుటుంబం “చివరి వేడుక”

196

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ ను విడనున్నారు. ఈ నేపథ్యంలోనే చివరి గుర్తుగా ఓ వేడుక నిర్వహించారు. ట్రంప్ రెండవ భార్య మార్లా మాప్లెస్ ఒక్కగానొక్క కుమార్తె టిఫ్పనీ ట్రంప్ ఎంగేజ్‌మెంట్‌ మంగళవారం శ్వేతసౌధంలో నిర్వహించారు. 27 ఏళ్ల టిఫ్పని ట్రంప్ తన బార్ స్నేహితుడు మైఖేల్‌ బౌలోస్‌ ను పెళ్లిచేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళవారం వీరి నిశ్చితార్తం జరిగింది.

ఈ మేరకు టిఫ్పని ట్రంప్ తండ్రి డోనాల్డ్ ట్రంప్ తో దిగిన ఫోటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. వైట్‌ హౌస్‌లో తన తండ్రి గడిపిన చివరి రోజు గుర్తిండిపోయేలా తన బారు ఫ్రెండ్‌తో నిశ్చితార్థం జరిగిందని, మైఖేల్‌తో రాబోయే జీవితానికి ఆశ్వీరాదం లభించినట్లైందని, సంతోషంగా అనిపించిందని అన్నారు. బౌలోస్‌ అదే ఫోటోను తన సొంత ఇన్‌స్ట్రా గ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ..తదుపరి ఆధ్యాయం కోసం ఎదురుచూస్తున్నామని, ఐలవ్‌యూ హనీ అని రాసుకొచ్చారు.

వైట్ హౌస్ లో ట్రంప్ కుటుంబం “చివరి వేడుక”