టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి 10 మంది సర్పంచ్ లు

468

నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి షాక్ తగిలింది. నిజామాబాద్ రురల్ నియోజకవర్గంలోని పలువురు టీఆర్ఎస్ నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఉన్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిశారు. ఆదివారం వీరంతా బీజేపీలో చేరే అవకాశం కనిపిస్తుంది. వీరిని ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలోకి ఆహ్వానించనున్నారు. కాగా వీరు రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారు. రూరల్ నియోజకవర్గ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని ఆ లేఖలో పేర్కొన్నారు.

టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరేవారిలో పది గ్రామాలకు చెందిన సర్పంచ్ లు ఉన్నారు. ఇక కులాచారి దినేష్ కుమార్ (మాజీ జడ్పీటీసీ సభ్యుడు), దివ్య ( నిజామాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్ పర్సన్), గద్దె భూమన్న (డిచిపల్లి ఎంపీపీ), శ్యామ్ రావు ( డిచిపల్లి వైస్ ఎంపీపీ), ఎంపీటీసీ సభ్యులు దండుగుల సాయిలు, భూక్యా నాయక్, సంతోష్, అప్పాల మంజుల గణేష్, మానస సాయి, దుంపల సౌమ్య సుధీర్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు పానుగంటి సతీష్ రెడ్డి ఉన్నారు.

నిజామాబాద్ జిల్లాలో ఇలా జరుగుతుందని టీఆర్ఎస్ నేతలు ఉహించి ఉండరు. తాజాగా అక్కడ ఎమ్మెల్సీగా గెలుపొందిన కవిత పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. అక్కడ స్థానిక నేతలతో భేటీ అవుతున్నారు. పార్టీ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు.

కాగా పార్లమెంట్ ఎన్నికల నుంచి నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తుంది. టీఆర్ఎస్ నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నారు. గతేడాది జరిగిన నిజామాబాద్ మునిసిపల్ ఎన్నికల్లో కూడా బీజేపీ పెద్ద సంఖ్యలో సీట్లు సాధించింది. ఒకానొక దశలో మునిసిపాలిటీ పీఠంపై బీజేపీ జెండా ఎగరేస్తుందని అందరు భావించారు. కానీ టీఆర్ఎస్ కు ఎక్స్ ఆఫిసియో సభ్యులు ఉండటంతో మునిసిపల్ చైర్మన్ పదవి దక్కించుకుంది.

టీఆర్ఎస్ కు భారీ షాక్.. బీజేపీలోకి 10 మంది సర్పంచ్ లు