అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మృతి

67

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి నల్లమాద దేవేందర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మంగళవారం న్యూజెర్సీలోని ఎడిసన్ లో ఈ ఘటన జరిగింది. అయితే దేవేందర్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు నుజ్జునుజ్జు అయింది. కానీ ప్రమాదం జరిగిన లక్షణాలు కనిపించడం లేదు. ఎవరైనా ఎటాక్ చేసి ఉంటారని అనుమానం వ్యక్తమవుతోంది. కాగా దేవేందర్ రెడ్డి అమెరికాలోని తెలంగాణ రాష్ట్ర సమితి అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. ఇతను ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో ముందుంటారని ఆయన స్నేహితులు చెబుతున్నారు.

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన దేవేందర్ రెడ్డి ఉద్యోగ నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడే స్థిరపడ్డారు. అమెరికాలో తెలంగాణ సొసైటీ ఏర్పాటులో చురుగ్గా వ్యవహరించారు. దేవేందర్ రెడ్డితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అమెరికాలోని తెలంగాణ ఎన్నారైలు నివాళుర్పించారు. దేవేందర్ రెడ్డి దేవరకొండలో కూడా అనేక సేవ కార్యక్రమాలు నిర్వహించేవారు. ఆయన మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక దేవేందర్ రెడ్డి మృతిపై కేసు నమోదు చేసుకున్న న్యూజెర్సీ పోలీసులు విచారణ చేపట్టారు

అమెరికాలో టీఆర్ఎస్ అధికార ప్రతినిధి మృతి