Tera chinnapareddy : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ :- వార్తలపై స్పందించిన తేరా

537

తెలంగాణ రాజకీయాలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఉన్నాయి. అధికార టీఆర్ఎస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు పలు మార్లు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు తమ పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని బహిరంగ చెప్పారు. 30 మంది ఎమ్మెల్యేలు తమకు టచ్ లో ఉన్నారని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పదే పదే అంటున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే తేరా చిన్నపరెడ్డి పార్టీ మారుతున్నారని బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారని వార్తలు చక్కర్లు కొట్టాయి. నాగార్జున సాగర్ ఉపఎన్నికల నేపథ్యంలో ఆయన బీజేపీ తీర్ధం పుచుకూలేందుకు సిద్ధంగా ఉన్నారని కథనాలు వ్రాసారు. అయితే వీటిపై శుక్రవారం చిన్నపరెడ్డి స్పందించారు. తనకు ఏ పార్టీలోకి పోవాల్సిన అవసరం లేదని, తాను టీఆర్ఎస్ లోనే కొనసాగుతానని పార్టీకి విధేయుడిగా ఉంటానని తెలిపారు. దింతో బీజేపీలో చేరుతున్నారన్న వార్తలకు చెక్ పడింది.

Tera chinnapareddy : బీజేపీలోకి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ :- వార్తలపై స్పందించిన తేరా