కారు పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

49

కరోనా మహమ్మారి ఎవరిని వదలడం లేదు. కొంచం అజాగ్రత్తగా ఉన్న ఎటాక్ చేస్తుంది. కేసుల సంఖ్య అధికంగా ఉండటంతో ట్రాకింగ్ కష్టంగా మారింది. ఇదిలా ఉంటే తాజాగా మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కరోనా బారినపడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. రెండు రోజులుగా జ్వరం వస్తుండటంతో ఆయన కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. దింతో ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. గత వారం రోజులుగా తనతో సన్నిహితంగా ఉన్నవారు పరీక్షలు చేయించుకోని హోమ్ క్వారంటైన్ లో ఉండాలని కోరారు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్.

తనను కలిసేందుకు ఎవరు రావద్దని ఫోన్ కూడా చెయ్యవద్దని అభిమానులకు, టీఆర్ఎస్ నేతలకు తెలిపారు. తాను త్వరలోనే కోలుకుంటానని, ప్రజలను కలుస్తానని అన్నారు. ఇక ఇప్పటికే పదుల సంఖ్యలో టీఆర్ఎస్ నేతలు కరోనా బారినపడ్డారు. వీరిలో నిజామాబాద్ ఎమ్మెల్యే గణేష్ గుప్తతో పాటు, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత, డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఉన్నారు. కాగా వీరంతా కోలుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. ప్రతి రోజులు 500 నుంచి 700 మధ్య కరోనా కేసులు నమోదవుతున్నాయి.

ఇక తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన కేసుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే 2,82,347 మంది కరోనా బారినపడ్డారు. వీరిలో 2,74,260 మంది కోలుకొని ఇళ్లకు వెళ్లారు. కరోనాతో 1518 మంది మృతి చెందారు. ప్రస్తుతం 6,569 కరోనా చికిత్స తీసుకుంటున్నారు. రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే కేసుల సంఖ్య అధికంగా నమోదవుతుంది.

కారు పార్టీ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్