బాలయ్యతో మాటల మాంత్రికుడి సినిమా?!

316

బాలయ్య అంటే మాస్.. మాస్ అంటే బాలయ్య. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా కథ, కథనం తెలిసిన దర్శకుడి చేతిలో పడితే బాలయ్య బొమ్మ బంపర్ హిట్టే. సమరసింహారెడ్డి నుండి లెజెండ్ వరకు ఇది ఎన్నోసార్లు రుజువైంది. అయితే.. ఈ మధ్య బాలయ్యకి భారీ సక్సెస్ లేనేలేదు. దీంతో ఇప్పటికే తనకు రెండు హిట్స్ ఇచ్చిన దర్శకుడు బోయపాటితో కలిసి మరో సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా టీజర్ నందమూరి అభిమానులకు అంచనాలు పెంచేయగా సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా పూనకాలు వచ్చేస్తాయి.

బోయపాటితో సినిమా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేనితో సినిమా చేసేందుకు పచ్చ జెండా ఊపేశాడు. రవితేజ క్రాక్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన గోపిచంద్ బాలయ్యతో సినిమాకు పనులు కూడా మొదలుపెట్టేశాడు. అయితే..ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో బాలయ్య సినిమా చేయనున్నాడని ఒక టాక్ మొదలైంది. త్రివిక్రమ్ ప్రస్తుతం స్నేహితుడు పవన్ అయ్యప్పన్ కోషియం సినిమా రచన, దర్శకత్వ పర్యవేక్షణతో పాటు తదుపరి జూనియర్ ఎన్టీఆర్ అయినను పోయిరావలె హస్తినకు సినిమా పనులలో బిజీగా ఉన్నాడు.

అయితే.. బాలయ్య గోపీచంద్ సినిమా.. త్రివిక్రమ్ ఎన్టీఆర్ సినిమా తర్వాత ఈ ఇద్దరి కాంబినేషన్ సినిమా ఉండనుందని సినీ వర్గాలలో ఒక ప్రచారం జరుగుతుంది. ఇది ఎంతవరకు నిజమన్నది తెలియదు కానీ ఈ కాంబినేషన్ సెట్టైతే మాత్రం అంచనాలు ఆకాశాన్ని తాకడం ఖాయం. త్రివిక్రమ్ మార్క్ మాటలు, డైరెక్షన్ కి.. బాలయ్య మేనరిజం కలిస్తే బాక్స్ బద్దలవడం ఖాయమని ట్రేడ్ పండితుల అంచనా. మరి ఈ కాంబినేషన్ పట్టాలమీదకి వస్తుందా లేక ప్రచారంగానే మిగిలిపోతుందా అన్నది చూడాల్సి ఉంది.

బాలయ్యతో మాటల మాంత్రికుడి సినిమా?!