స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్

159

తమిళనాట ఎన్నికల వేడి మొదలైంది. ఏప్రిల్ నెలలో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది. ఒకే విడతలో ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. ఇక ఇదిలా ఉంటే డీఎంకే అధినేత స్టాలిన్ పై అన్నాడీఎంకే ట్రాన్స్ జెండర్ ను పోటీలో దింపనుంది. ప్రధాన పార్టీలన్నీ సీట్ల పంపకాలను ముమ్మరం చేసిన నేపథ్యంలో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన పార్టీలన్నీ వచ్చేవారం తమ అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నాయి. అయితే స్టాలిన్ పై ట్రాన్స్ జెండర్ కార్యకర్త అప్సరా రెడ్డిని బరిలోకి దింపాలని అన్నాడీఎంకే భావిస్తోంది. స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొలతూర్ నుంచి పోటీ చేసేందుకు అప్సర సైతం ఆసక్తి కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ ట్రాన్స్ జెండర్స్ సంఖ్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలోనే అప్సరను పోటీలో దింపేందుకు అన్నాడీఎంకే సిద్దమైనట్లు తెలుస్తుంది.

స్టాలిన్ పై పోటీకి ట్రాన్స్ జెండర్