ప్రకాశం జిల్లాలో విషాదం

169

ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. గిద్దలూరు మండలం విఠముసురుపల్లెకు చెందిన ముగ్గురు చిన్నారులు. సగిలేరు వాగులో ఈతకు వెళ్లి మృతి చెందారు. మృతులు సుస్మిత(9), సుప్రియ(12), దీప్తి(13)గా గుర్తించారు. అప్పటివరకు అక్కడే ఆడుకొని అంతలోనే విగతజీవులుగా కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఘటన విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ముగ్గురు చిన్నారుల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ప్రకాశం జిల్లాలో విషాదం