టీపీసీసీ ఎంపిక ప్రక్రియ : మరోసారి ఢిల్లీకి ఎంపీ కోమటిరెడ్డి

67

ఢిల్లీలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు వరుసగా ఢిల్లీ బాట పడుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లారు. నెలాఖరుకు తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ పూర్తి అవుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆశావహులు ఢిల్లీ పెద్దలను కలుస్తున్నారు. అయితే పీసీసీ రేసులో ప్రముఖంగా రేవంత్ రెడ్డి , శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

మాజీ ఎంపీ విహెచ్ , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క , అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా పీసీసీ పదవికోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తనకు పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేస్తానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే చెప్పారు. అందుకోసం ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలపై ఒత్తిడి కూడా తెస్తున్నారు.