ఇండియాలో ఆ ఐదు బ్రాండ్లదే హవా

132

దేశంలో ఆటో మొబైల్ రంగం అంచలంచలుగా ఎదుగుతుంది. కరోనా క్లిష్ట సమయంలో కూడా 4.5 శాతం వృద్ధి రేటు సాధించింది ఆటోమొబైల్ రంగం. దేశంలో కార్ల వాడకం పెరుగుతుంది ఉందని పలు నివేదికలు చెబుతున్నాయి. వీటిలో దేశీయ కార్ల విక్రయాలలో మెజారిటీ వాటాను 5 కంపెనీలు ఆక్రమిస్తున్నట్లు ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ సమాఖ్య తాజాగా పేర్కొంది.

దీంతో ప్యాసింజర్ వాహన మార్కెట్లో 85 శాతం వాటా వీటి సొంతంకాగా.. మరో 22 బ్రాండ్లు మిగిలిన 15 శాతం మార్కెట్లను పంచుకుంటున్నట్లు తెలియజేసింది. ఇక ఈ ఐదు బ్రాండ్లు మారుతీ సుజుకీ, హ్యుండాయ్‌, టాటా మోటార్స్‌, కియా మోటార్స్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా ప్రధాన వాటాను గెలుచుకున్నట్లు పేర్కొంది.

ఇక విదేశీ కంపెనీలైన రేనాల్ట్‌, ఫోర్డ్‌, హోండా, టయోటా, ఫోక్స్‌వ్యాగన్‌ తదితరాలు పోటీ పడుతున్నప్పటికీ దేశీయంగా పరిస్థితులు వేరని ఆటో రంగ నిపుణులు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆటో మేటివ్ మార్కెట్ లో భారత్ నాలుగవ స్థానంలో ఉంది. చైనా మొదటి స్థానంలో ఉంది. అయితే దేశీయ కంపెనీ కార్లను అత్యధికంగా ఇండియాలోనే వాడుతున్నారు.

ఇతర దేశాల్లో దేశి కార్లను వాడటం 70 శాతం కంటే తక్కువే ఉంది. ఒక్క జపాన్ మాత్రం అత్యధికంగా 81 శాతంగా నమోదవుతుండటం గమనార్హం. జపాన్‌లో మార్కెట్‌ లీటర్లు జపనీస్‌ కంపెనీలేకావడం విశేషం. పలు దేశాలలో ప్రాధాన్యత కలిగిన టయోటా వాటా దేశీయంగా 3 శాతానికి పరిమితమవుతున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి

 

ఇండియాలో ఆ ఐదు బ్రాండ్లదే హవా