ఇవాళ ఒక్కరోజే 3.7 కోట్ల మంది పుడుతున్నారట

1215

జనవరి 1 తేదీ అందరికి స్పెషల్. ఈ రోజు జన్మించినవారు జీవితాంతం స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తారు. ఈ రోజు డెలివరీ అయ్యేందుకు చాలామంది గర్భిణీలు ఇష్టపడతారు. సాధారణ కాన్పు జరగనప్పటికీ సిజేరియన్ చేసుకునేందుకు ఇష్టపడే మహిళలు చాలామంది ఉంటారు. ఇక న్యూ ఇయర్ రోజు పిల్లలను కనాలని ప్లానింగ్ చేసుకునే భార్యాభర్తలు కూడా ఉన్నారు. కొత్త ఏడాది ఇంట్లోకి కొత్త వ్యక్తి వస్తుంటే ఎవరు మాత్రం వద్దనుకుంటారు చెప్పండి.

ఇది ఇలా ఉంటే, 2021 జనవరి 1 తేదీ ప్రపంచ వ్యాప్తంగా 3.7 కోట్లమంది చిన్నారులు జన్మించనున్నట్లు యూనిసెఫ్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లోని గర్భవతులు లెక్కలు సేకరించి ఈ వివరాలు తెలిపింది యూనిసెఫ్. ఇక భారత దేశంలో 60 వేలమంది జన్మించనున్నట్లుగా తెలిపింది. 2021 లో మొదటి బిడ్డ ఫీజి దేశంలో జన్మించాడు. ఇక చివరి బిడ్డ అమెరికాలో జన్మించే అవకాశం ఉన్నట్లు యూనిసెఫ్ తెలుస్తుంది. ప్రపంచంలో అత్యధిక జననాలు ఇండియాలోనే జరగనున్నాయి.

ఈ రోజు 59,995 మంది శిశువులు జన్మించనున్నారు. ఆ తర్వాత చైనాలో 35,615 మంది, నైజీరియాలో 21,439, పాకిస్తాన్‌లో 14,161, ఇండోనేషియాలో 12,336, ఇథియోపియాలో 12,006, అమెరికాలో 10,312, ఈజిప్టులో 9,455, బంగ్లాదేశ్‌లో 9,236, కాంగోలో 8,640 మంది శిశువులు జన్మించనున్నారని తెలిపింది. ఇక 2021 లో 14 కోట్లమంది శిశువులు జన్మించే అవకాశం ఉన్నట్లుగా వివరించింది. జనవరి నుంచి మార్చి మధ్య 5 నుంచి 6 కోట్లమంది జన్మిస్తారని తెలిపింది. కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా జననాల సంఖ్య విపరీతంగా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొంది యూనిసెఫ్

ఇవాళ ఒక్కరోజే 3.7 కోట్ల మంది పుడుతున్నారట