ఈ రోజు మహేష్ బాబుకు ఎంతో ప్రత్యేకం

372

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈ రోజు ఎంతో ప్రత్యేకమైన రోజట.. ఈ విషయాన్నీ స్వయంగా మహేష్ బాబు తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. కారణం ఈ రోజు మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు. ఈ సందర్బంగా ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతూ నమ్రత శిరోద్కర్‌తో కలిసి దిగిన ఓ అపురూప చిత్రాన్ని షేర్‌ చేశారు మహేష్ చేశారు. ‘నేనెంతో ప్రేమించే వ్యక్తి పుట్టినరోజు నేడు. నమ్రత.. నీతో ప్రతిరోజూ ప్రత్యేకంగా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం మరెంతో ప్రత్యేకం.

నా అద్భుతమైన మహిళకు జన్మదిన శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్‌డే బాస్‌ లేడీ’ అని మహేశ్‌ పేర్కొన్నారు. ఇక మహేష్ షేర్ చేసిన పోస్ట్ కు నమ్రత రిప్లై ఇచ్చారు. ‘నా ప్రతి ఏడాదినీ ఎంతో స్పెషల్‌గా చేస్తున్నందుకు థ్యాంక్యూ. లవ్‌ యూ’ అని రిప్లై ఇచ్చారు. ఇక నమ్రత పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లారు.

ప్రసుతం మహేష్ బాబు సర్కారివారి పాట చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. సినిమాలో మహేష్ కు జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూట్‌ దుబాయ్‌లో ప్రారంభం కానుందని వార్తలు వస్తున్నాయి. మరోవైపు ఇందులో మహేశ్‌ పొడవాటి జుట్టు.. విభిన్నమైన లుక్‌లో కనిపించనున్నారు.

ఈ రోజు మహేష్ బాబుకు ఎంతో ప్రత్యేకం