నేడు ఉదయ్ కిరణ్ 7వ వర్ధంతి.

1320

తెలుగు సినిమా పరిశ్రమలో ఒక ఉప్పెన ఉదయ్ కిరణ్. సినీ పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా చిత్రం సినిమాతో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి యాట్రిక్ విజయాలను అందుకున్నాడు. చిత్రం నువ్వేనువ్వే, మనసంతా నువ్వే సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఈ సమయంలోనే ఓ ప్రముఖ హీరో కుటుంబానికి ఉదయ్ కిరణ్ దగ్గరయ్యారు. వారి ఇంటి అల్లుడిగా చేసుకుంటారని అందరు అనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాలతో వారిబంధం బెడిసికొట్టింది.

ఒకేసారి ఉదయ్ కిరణ్ కెరీర్ తలకిందులైపోయింది. కారణం ఏంటో తెలియదు కానీ టాప్ హీరోకి అవకాశాలే లేకుండా పోయాయి. చేతిలోకి వచ్చిన ప్రాజెక్టులు కూడా వెనక్కు వెళ్లాయి. దింతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు ఉదయ్ కిరణ్. 2004 తర్వాత సరైన హిట్స్ లేకపోవడం, అవకాశాలు రాకపోవడంతో ఆర్ధికంగా చితికిపోయారు. వచ్చిన చాన్సులు నిలబడక. కొత్త అవకాశాలు రాక ఎటూ కాకుండా పోయింది ఉదయ్ కిరణ్ కెరియర్. పదేళ్ల పాటు తన సినిమా కెరీర్‌ను కాపాడుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన నటుడు..

జీవితంలో విఫలమై 2014 జనవరి 5న ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఓ యువ హీరోను చిధిమేశారు అంటూ అప్పట్లో నానా రచ్చ జరిగింది కూడా. టాప్ హీరోలే కారణమని కోర్టుకు వెళ్లారు ఆయన అభిమానులు. లోలోపల ఎం జరిగిందో తెలియదు కానీ ఓ గొప్ప నటుడిని కోల్పోయింది తెలుగు సినీ పరిశ్రమ.

నేడు ఉదయ్ కిరణ్ 7వ వర్ధంతి.