Sarpanch సర్పంచి పదవికి రూ. 52 లక్షలు

157

ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల హడావిడి కొనసాగుతుంది. ఓ వైపు నామినేషన్లు కొనసాగుతుంటే మరోవైపు సర్పంచి పదవికి వేలంపాటలు జోరందుకున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే రెండు గ్రామాల్లో సర్పంచి ఎన్నికలకు వేలం జరిగింది. మీడియాకు తెలిసి రెండు చోట్ల జరిగింది. తెలియకుండా ఇంకా చాలా పంచాయితీల్లో ఏకాగ్రవం జరిగే అవకాశం లేకపోలేదు. మొన్న దుర్గాడ గ్రామంలో సర్పంచి పదవికి వేలం నిర్వహించగా, గురువారం తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం రాజపూడి గ్రామంలో సర్పంచి పదవికి వేలంపాట నిర్వహించారు. ఈ పాటలో సర్పంచి పదవిని రూ. 52 లక్షలకు పాడాడో ఓ వ్యక్తి. అయితే ఎన్నికల్లో పోటీ చెయ్యాలని తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేస్తే గ్రామస్తులంతా పాటపాడిన వ్యక్తికే ఓట్లు వేస్తామని మాట ఇచ్చారు. ఒకవేళ ఎన్నికలో ఓడిపోతే ఆ 52 లక్షలు ఇచ్చేది లేదని ఒప్పదం ఖరారైంది.

Sarpanch సర్పంచి పదవికి రూ. 52 లక్షలు