పెళ్లిపీటల మీదినుంచి వచ్చి ప్రాణం పోశారు..

251

పెళ్లి జీవితంలో ఒకే సారి జరిగే ఘట్టం.. ఈ రోజు ఇల్లంతా బంధువులతో కోలాహలంగా ఉంటుంది. బాజాభజంత్రీలు, చిన్న పిల్లల ఆటలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. ఇవన్నీ ఒకెత్తు అయితే పెళ్లి రోజు వధువరులు చేసే పని మరోఎత్తు ఉంటుంది. పెళ్లి రోజు చాలా జంటలు జీవితాంతం గుర్తుండిపోయే పనులు చేస్తుంటారు. ఆ రోజు ఎన్నికల లాంటివి ఉంటే పెళ్ళిబట్టలపైనే వెళ్లి ఓటేస్తారు. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారు ఏదైనా అత్యవసర పని ఉంటే పెళ్లిబట్టలమీదనే వెళ్తుంటారు. అయితే తాజాగా ఓ జంట చేసిన సాయం అందరి మెప్పు పొందేలా చేసింది.

ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న యువతికి అర్జెంటుగా రక్తం ఎక్కించాల్సి ఉంది.. సమయానికి దాతలెవరు దొరకలేదు. ఏం చెయ్యాలో తెలియక యువతి కుటుంబ సభ్యులు తర్జనభర్జన పడుతున్నారు. అయితే రక్తం అవసరమని పెళ్లి పీటల మీద ఉన్న వరుడికి తెలియడంతో వెంటనే కూడా వధువును తీసుకోని వెళ్ళిపోయాడు. ఆసుపత్రికి చేరుకొని రక్తం ఇచ్చి యువతి ప్రాణాలు నిలబెట్టారు. కాగా వీరు చేసిన సాయం మరిచిపోలేనిది..పెళ్లి బట్టలపై వచ్చి రక్తం ఇవ్వడంతో అందరు ఆ జంటను మెచ్చుకుంటున్నారు. గొప్ప సేవ చేశారు శబాష్ అంటూ కీర్తిస్తున్నారు. కాగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్​లో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఫొటోను అక్కడి పోలీస్​ కమిషనర్​ ఆశిష్​ మిశ్రా ట్విట్టర్​లో షేర్​ చేశారు. దీంతో నెట్టింట్లో ఆ ఫొటో వైరల్​ అయింది. కొత్త జంటకు నెటిజన్లు శుభాకాంక్షలు చెప్పారు. అయితే, ఈ జంట వివరాలను మిశ్రా వెల్లడించలేదు.

పెళ్లిపీటల మీదినుంచి వచ్చి ప్రాణం పోశారు..