అర్హులకు కరోనా వ్యాక్సిన్, యాప్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

89

అర్హులకు కరోనా టీకా, యాప్ సిద్ధం చేస్తున్న ప్రభుత్వం

కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు భారత్ సిద్ధమైంది. 2021 జనవరి నుంచి కరోనా వ్యాక్సిన్ వేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే అన్ని రాష్ట్రాలు వ్యాక్సిన్ స్టోరేజ్ కొరకు స్టోర్ రూమ్స్ తయారు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖా సూచనలు చేసింది. ఇక ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో స్టోర్ రూమ్స్ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి.

వ్యాక్సిన్ ఇచ్చేందుకు ఆయా రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాయి. తెలంగాణ ప్రభుత్వం అర్హులకోసం యాప్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం యాప్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతుంది. ఇది వారం నుంచి 10 రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. వ్యాక్సిన్ కావాలి అనుకునే వారు తమ పేరు, ఇతర వివరాలు నమోదు చేసుకుంటే సరిపోతుంది. అధికారులు ఇంటికి వచ్చి కానీ, లేదంటే క్యాంపులలో కానీ వ్యాక్సిన్ ఇస్తారు.

తోలి దశలో తెలంగాణలో 70 నుంచి 75 లక్షల మందికి వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక దీనికి సంబందించిన పనులలో నిమగ్నమయ్యారు ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు. గత రెండు రోజులుగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ ఇవ్వడానికి గాను ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో పని చేస్తున్న 3 లక్షల మంది వివరాలను వైద్య సిబ్బందిని ఆరోగ్య శాఖా సేకరించింది.

ఇక ము న్సిపల్‌ సిబ్బంది, పోలీసులు, జర్నలిస్టులు, ఇతర ఫ్రంట్‌లైన్‌ వర్కర్ల సమాచారాన్ని కూడా సేకరిస్తున్నారు. కాగా రాష్ట్రంలో 3 కోట్ల వ్యాక్సిన్ డోసులు నీవువ ఉంచేందుకు స్టోర్ రూమ్స్ సిద్ధం చేశారు.