మమతకు షాక్.. బీజేపీలో చేరిన మరో ఎమ్మెల్యే

133

పశ్చిమ బెంగాల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే పార్టీని విడిచిపెట్టే తృణమూల్ కాంగ్రెస్ నాయకుల జాబితా ఇంకా పెరుగుతూనే ఉంది. తాజాగా శాంతిపూర్ ఎమ్మెల్యే అరిందం భట్టాచార్య బుధవారం ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) లో చేరారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బెంగాల్ ఇన్‌చార్జి కైలాష్ విజయవర్గియా సమక్షంలో భట్టాచార్య కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. బిజెపిలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడిన భట్టాచార్య తనలాంటి యువ నాయకులను టిఎంసి నాయకత్వం అడ్డుకుంటుందని ఆరోపించారు.

‘ఎన్నో ఆశలతో టిఎంసిలో చేరాను. నా ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనీ పెద్ద ప్రణాళికలు రచించుకున్నాను, ఆ దిశగా నా వంతు ప్రయత్నం చేశాను కాని నా లాంటి వ్యక్తుల పురోగతిని టిఎంసి అడ్డుకుంటోంది. అందువల్ల బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాను’ అని అరిందం భట్టాచార్య అన్నారు.