తిరుపతి పోటీలో బీజేపీ, జనసేన అభ్యర్థులు

80

తిరుపతి ఉపఎన్నికల్లో తమ మిత్ర పక్షం జనసేన కూడా పోటీ చేస్తుందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులకు ఖండిస్తూ సోమవారం రామతీర్థంలో నిరసన తెలుపుతామని తెలిపారు. రాష్ట్రంలో హిందూ ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆలయాలపై దాడులు రాజకీయ అంశం కాదని ఆత్మభిమానం, స్వాభిమానానికి సంబందించిన అంశమని అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక తిరుపతి ఉపఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని సోము వీర్రాజు తెలిపారు. కేంద్ర నాయకులు కూడా తిరుపతి ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ విజయం సాధిస్తే రాష్ట్రంలో పాగా వెయ్యొచ్చని భావిస్తున్నారు బీజేపీ నేతలు. ఇక ఇక్కడ గెలిచిన వారికి కేంద్ర మంత్రి పదవికూడా వరించే అవకాశం ఉంది. దింతో బీజేపీ బలమైన అభ్యర్థికోసం వెతుకుతుంది. తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనలో పొత్తు బెడిసికొట్టినట్లు తెలుస్తుంది. అందుకే ఇరు పార్టీలు తమ అభ్యర్థులను బరిలో ఉంచుతున్నారు.