రికార్డ్ స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం

68

తిరుమల వేంకటేశ్వరస్వామికి రికార్డ్ స్థాయిలో ఆదాయం వచ్చింది. మంగళవారం ఒక్కరోజే మూడు కోట్ల 23 లక్షల రూపాయల కానుకలు సమర్పించారు భక్తులు, లాక్ డౌన్ తర్వాత ఇదే అత్యధికం. ఇక మంగళవారం 33,743 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 11490 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. ఇక ఈ నెల 25న వైకుంఠ ఏకాదశి పర్వదినం ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబందించిన ఏర్పాట్లను అధికారులు చేస్తున్నారు. రోజుకు 10 వేలమందికి వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నారు. రోజుకు పది వేలు చొప్పున లక్ష టోకెన్లు జారీ చేయనుంది టిటిడి. ఇక ఇప్పటికే ఆన్ లైన్ వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి ట్రస్ట్ టిక్కెట్ల విడుదల చేశారు.

10 రోజులకు 18 వేల టికెట్లను ఆన్ లైన్ లో టీటీడీ విడుదల చేసింది. శ్రీ వాణి ట్రస్ట్ కి పది వేలు విరాళం ఇచ్చిన భక్తులకు టికెట్లను కూడా మరో ఐదు వందలు అదనంగా చెల్లిస్తేనే ఇవ్వనున్నారు.

రికార్డ్ స్థాయిలో వెంకన్న హుండీ ఆదాయం