ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న “టిక్ టాక్”

137

షార్ట్ వీడియోస్ మేకింగ్ దిగ్గజం టిక్ టాక్ ఇండియాలోని తమ ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడింది. టిక్ టాక్ పై కేంద్ర ప్రభుత్వం శాశ్వత నిషేధం విధించిన విషయం విదితమే. దీనితోపాటు మరో 57 యాప్స్ పై శాశ్వత నిషేధం విధించింది భారత ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే తమ ఉయోగులను తొలగించే పనిలో పడింది టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్.. ఈ మేరకు ఉద్యోగులకు బుధవారం ఓ మెమో జారీచేసింది. టిక్ టాక్ పై ఉన్న నిషేధాన్ని కొంతకాలానికే విధిస్తారని తాము భావించామని, కానీ భారత్ దాన్ని శాశ్వత నిషేదిత యాప్స్ జాబితాలో చేర్చిందని, సేవలు లేకుండా ఉద్యోగులను కొనసాగించడం కష్టమని పేర్కొంది.

ఇండియాలో తిరిగి ఎప్పుడు యాప్ పున‌రుద్ధ‌రిస్తామో తెలియ‌దు అని బైట్‌డ్యాన్స్ ఆ మెమోలో పేర్కొన్న‌ది. ఇక చైనాకు చెందిన మరి కొన్ని యాప్స్ కూడా తమ ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. వీటిలో హలో యాప్ కూడా ఉంది. తమ ఉద్యోగులను తొలగించే ప్రక్రియను హలో యాప్ కూడా మొదలు పెట్టినట్లు సమాచారం. షేర్ ఇట్, వుయ్ షేర్, తోపాటు మరికొన్ని యాప్స్ శాశ్వతంగా మూసివేయడం జరిగింది.

ఇండియాలో ఉద్యోగులను తొలగిస్తున్న “టిక్ టాక్”