తుంగభద్ర డ్యామ్ లో అనూహ్యంగా పెరిగిన 5 టిఎంసీలు

145

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్‌ అయిన తుంగభద్ర డ్యామ్‌ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం గతేడాది వరకూ 100 టిఎంసీలే అనుకున్నారు.. కానీ అనూహ్యంగా డ్యామ్ లో 5 టిఎంసిల నీరు పెరిగిందని అధికారులు తేల్చారు. ప్రస్తుతం డ్యామ్ లో 105.79 టీఎంసీల నీరు నిల ఉందని తెలిపారు. 2008లో ఇది 100.85 టీఎంసీలు కాగా.. గడచిన పుష్కర కాలంలో వరద ప్రవాహం వల్ల డ్యామ్‌లో పూడిక తొలగడంతో నీటి నిల్వ సామర్థ్యం దాదాపు టీఎంసీల మేర పెరిగిందని నివేదించారు.

డ్యామ్‌లో పూర్తి నీటి నిల్వ సామర్థ్యాన్ని తేల్చేందుకు చేయించిన ఇటీవల తుంగభద్ర బోర్డు ఇటీవల స్థలాకృతి, నీటి లోతు సర్వే నిర్వహించింది.. ఈ సర్వేలో ఈ విషయం వెల్లడైంది. ఈ క్రమంలో తాజా నీటి నిల్వ సామర్థ్యం మేరకు.. మూడు రాష్ట్రాలకు దామాషా పద్ధతిలో నీటిని పంపిణీ చేయాలని తుంగభద్ర బోర్డును ఏపీ ప్రభుత్వం కోరింది. దాంతో సర్వే ప్రకారం వివిధ సంవత్సరాలలో డ్యామ్ నీటి నిల్వ సామర్ధ్యం.. ఇలా ఉంది.
1953 – 132.47
1963 – 114.66
1972 – 121.08
1981 – 115.88
1985 – 111.83
1993 – 111.50
2004 – 104.34
2008 – 100.85
2020 – 105.79