ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెడ్

153

విధి నిర్వహణలో ఉండి మద్యం సేవించిన ముగ్గురు కానిస్టేబుళ్లను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. ఫిబ్రవరి 12 తేదీన డ్యూటీలో ఉండి ఓల్డ్‌ ఎమ్మెల్యే క్వార్టర్స్‌ వద్ద మద్యం సేవించారు. అయితే ఈ దృశ్యాలను షాడో పోలీస్ టీం సెల్ ఫోన్ లో బంధించారు. దీనిని గమనించిన ముగ్గురు కానిస్టేబుల్స్ షాడో పోలీస్ టీంలోని జవాన్ పై దాడి చేసి సెల్ ఫోన్ లాక్కున్నారు. దింతో సదరు షాడో పోలీస్ టీం జవాన్ నారాయణగూడ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

స్టేషన్ లో ఉన్న ఏఎస్ఐ ఠాకూర్ వారికి సర్దిచెప్పి జవాన్ కు సెల్ ఫోన్ ఇప్పించారు. 24గంటల తరువాత ఎస్‌బీ ఇచ్చిన రిపోర్ట్‌ ఆధారంగా ముగ్గురు కానిస్టేబుళ్లను నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సస్పెండ్‌ చేశారు. కాగా సస్పెండ్ అయిన ముగ్గురు నారాయణగూడ పీఏస్‌లో విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు నాగరాజు, విశాల్‌, శివప్రసాద్ లు. ‌

ముగ్గురు కానిస్టేబుల్స్ సస్పెడ్