ఎన్నికల సమావేశానికి ఎస్ఈసీ వేటు వేసిన ఆ ఇద్దరు అధికారులు?

127

ఏపీలో ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం, ఎన్నికల సంఘం తమ తమ విధుల నిర్వహణ మొదలు పెట్టాయి. బుధవారం ముందుగా గవర్నర్ బీబీ హరిచందన్ తో సమావేశమైన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ అక్కడ నుండి నేరుగా తన కార్యాలయానికి వెళ్లి రాష్ట్ర ఉన్నతాధికారులతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్ తో పాటు పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ కూడా పాల్గొన్నారు.

కాగా, పంచాయతీ రాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ, కమీషనర్ గిరిజా శంకర్ లపై ఎస్ఈసీ ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. వారిని విధుల నుండి తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. అయితే.. ఎస్ఈసీ సమావేశం సమయానికి ప్రభుత్వం నుండి వారిపై చర్యల ఆదేశాలు రాకపోవడంతో వారు కూడా సమావేశానికి హాజరయ్యారని తెలుస్తుంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఎన్నికల కమిషనర్ దిశానిర్ధేశాల మేరకే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది. తనకు సహకరించని కారణంగా ఆ ఇద్దరు అధికారులను రమేష్ కుమార్ విధులను తప్పించగా అంతే స్పీడుగా ప్రభుత్వం నుండి ఆదేశాలు రాలేదు. ఆలస్యంగానైనా ఉత్తర్వులు వస్తాయా.. లేక ఇది మరో రగడ అవుతుందా అన్నది చూడాల్సి ఉంది.

ఎన్నికల సమావేశానికి ఎస్ఈసీ వేటు వేసిన ఆ ఇద్దరు అధికారులు?