Viral video: భారీ అనకొండలు మనిషి మీద పాకుతుంటే ఇలా ఉంటుంది!

56

Viral video: చిన్న పాము పిల్ల మన ముందు కనిపిస్తే కెవ్వున కేక వేసి పరుగులు తీస్తాం. ఇంకా గుండె ఆగెంత భయం ఉన్న వాళ్ళైతే అక్కడ టపీమని పడిపోతారు. నూటికో కోటికో ఒకరు మాత్రం వాటిని ఒక జీవిలాగానే.. వాటితో ఆటలు ఆడుకుంటుంటారు. ఇప్పటికే మనం సామజిక మాధ్యమాలలో అలాంటి వారిని చూసే ఉంటాం. కానీ ఇప్పుడు సామజిక మాధ్యమాలలో ఒక వీడియో హల్చల్ చేస్తుంది. అందులో భారీ భారీ అనకొండలు ఆ వ్యక్తి మీద పడుతున్నా కనీసం చలనం లేదు అతనిలో. పైగా ఆ పాములు మసాజ్ చేస్తున్నంత సమ్మగా ఎంజాయ్ చేస్తున్నాడు.

ఈ వీడియోలో పాముల‌ను ఉంచిన ప్లేస్‌లో ఆ వ్య‌క్తి కూర్చొని ఉండ‌గా.. అత‌నిపై అవి పాకుతూ వెళ్లాయి. కొన్ని స‌ర్పాలైతే ఏకంగా అత‌నిపై ప‌డ్డాయి. పైనపడిన పాములు భారీ బరువు ఉన్నట్లుగా అర్ధమవుతుంది. కానీ అతనిలో ఎలాంటి చలనం లేదు. అసలు ఆ పాములు కూడా అత‌నికి ఎలాంటి హానీ క‌లిగించ‌లేదు. 50 మిలియ‌న్ డాల‌ర్ల కోసం ఒక గంట పాటు ఆ స‌ర్పాల మ‌ధ్య‌లో ఉండ‌గ‌ల‌రా? అని ప్ర‌శ్నిస్తూ వీడియోను ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు. మొత్తం 12 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతుండగా 24 గంట‌ల్లోనే 3 ల‌క్ష‌ల మంది వీక్షించారు.

భారీ అనకొండలు మనిషి మీద పాకుతుంటే ఇలా ఉంటుంది!