Budget : బడ్జెట్ లో రైతులకు పెద్దపీఠ

161

కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. దేశంలో 70 శాతం మంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనిచేస్తున్నారు. వారికి మరింత మేలు జరిగే విధంగా, 2022 నాటికీ రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా కేంద్ర బడ్జెట్ లో వ్యవసాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. 2021 – 2022 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.16.5 లక్షల కోట్లు కేటాయించారు. ఈ సందర్బంగా ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మాట్లాడుతూ గోధుమ పండించే రైతుల సంఖ్య పెరిగిందని తెలిపారు.

గత ఏడేళ్లలో రైతుల నుంచి రెట్టింపు వరి ధాన్యం కొనుగోలు చేశామని వివరించారు. అలాగే రైతులకు తమ పంటలకు ఎంఎస్‌పి కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ ఇస్తామని, దీని కోసం రైతులకు 75 వేల కోట్లు ఇస్తున్నట్లు తెలిపారు. రైతులకు చెల్లింపు పెరిగిందని ఆర్థిక మంత్రి చెప్పారు. నీటి సదుపాయాలకు 2.87 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తెలిపారు. మద్దతు ధర కింద గోధుమ రైతులకు గత ఆర్థిక సంవత్సరంలో 75 వేల కోట్లు కేటాయించామని, కనీస మద్దతు ధరకు లక్షా 72 వేల కోట్లు కేటాయించామన్నారు.

ఇక వ్యవసాయానికి పెట్రోల్, డీజిల్ నుంచి సెస్ ద్వారా కేటాయింపులు జరుపుతామని వివరించారు. డీజిల్ పై రూ.4, పెట్రోల్ పై రూ.2.5 ను వ్యవసాయ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు. అయితే పెట్రోల్ డీజిల్ రేట్లు పెరగవని, ప్రస్తుతం ఉన్న సెస్ నుంచి చెల్లింపులు జరుగుతాయని తెలిపారు.

Budget : బడ్జెట్ లో రైతులకు పెద్దపీఠ