బలే మంచి దొంగ.. కారు యజమానికే నీతులు చెప్పాడు.

914

దొంగలకు కూడా మానవత్వం ఉంటుందని ,అమెరికాలోని ఆరెగాన్ లో జరిగిన ఓ ఘటన నిరూపించింది. ఓ మహిళ తన కారును సూపర్ మార్కెట్ ముందు పార్కింగ్ చేసి వెళ్ళింది. ఇంతలో ఓ దొంగ అటుగా వచ్చి కారుతో ఉడాయించాడు. కొద్దీ దూరం వెళ్లి వెనక సీటులో చూశాడు. అందులో ఓ చిన్న పాప ఉంది. దింతో సదరు దొంగ తిరిగి కారు పార్క్ చేసిన ప్రదేశానికి వచ్చాడు. అక్కడ కంగారు పడుతున్న ఓ మహిళను గమనించి కారు ఆమెది అని భావించాడు. అక్కడికి వెళ్లి పాపను ఆమెకు ఇచ్చాడు. దింతో ఆమె సంతోషంతో కన్నీరుపెట్టుకుంది. అయితే ఆ దొంగ పాపను ఆమెకు ఇచ్చి కారుతో పారిపోయాడు.

దింతో సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కారును గుర్తించారు. అయితే దొంగమాత్రం తప్పించుకున్నాడు. బిడ్డను తల్లికి ఇచ్చే సమయంలో ఆ దొంగ కొన్ని మాటలు మాట్లాడాడు. పసిబిడ్డను కారులో వదిలేస్తావా.. బిడ్డకు ఏమైనా అయితే ఏంటి పరిస్థితి?’ అంటూ బిడ్డ తల్లి, కారు యజమానిని మందలించాడు. దొంగమాటలు విని ముక్కుమీద వేలేసుకున్నారు పక్కనున్నవారు. అయితే తప్పించుకున్న దొంగ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అతడి నమూనాలను విడుదల చేసి ఎవరికైనా కనిపిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు పోలీసులు. కారులో పసిపాప లేకపోయి ఉంటే ఆ కారు దొరికేది కాదేమో.. ఇక ఆ దొంగకు మానవత్వం లేకపోతే పాప కూడా దొరికి ఉండేది కాదు.