దొంగతనానికి వెళ్లి షాక్ కొట్టి చనిపోయిన దొంగ

59

దొంగతనానికి వెళ్లిన దొంగ కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు.. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం మల్కాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తుండేవారు.. శివారు ప్రాంతాల్లోని ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి రాగి తీగను దొంగతనం చేసేవారు.

ఈ క్రమంలోనే మల్కాపూర్ గ్రామ శివారు లోని సిమెంట్ ఇటుకల కంపెనీలో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ కు విద్యుత్ ని నిలిపి వేసి ,రాగి తీగను దొంగతనం చేయడానికి ఈ నెల 19 వ తేదీన ప్రయత్నం చేయగా ,ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రసారం కావడంతో ముగ్గురు దొంగల లో సంగమేశ్వర్ (22) అనే దొంగ అక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరు దొంగలు మృతదేహాన్ని అక్కడే వదిలేసి పారిపోయారు.

ఇక మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు రెండు రోజుల తర్వాత అక్కడికి వచ్చారు. అయితే వారికీ మృతదేహం తీసుకెళ్లడం కష్టంగా మారింది. ఇక ట్రాన్స్ఫార్మర్ చివరన ఉండటంతో ఎవరు అటువైపు వెళ్ళలేదు. దింతో మృతదేహం అక్కడే పడివుంది..

ఇద్దరు దొంగలు హైదరాబాద్ చేరుకున్నారు. రెండు రోజులపాటు అటు ఇటు తిరుగుతు, ఛాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా వీరిద్దని పోలీసులు పలు కోణాల్లో విచారించగా పొంతనలేని సమాధానం చెప్పారు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. దింతో అసలు విషయం చెప్పారు ఇద్దరు దొంగలు.

ఛాదర్ ఘాట్ పోలీసులు చౌటుప్పల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దింతో ట్రాన్స్ఫార్మర్ దగ్గరకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఆసుపత్రికి తరలించారు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్లుగా సమాచారం.

దొంగతనానికి వెళ్లి షాక్ కొట్టి చనిపోయిన దొంగ