వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు

143

ఎమ్మెల్యే ఇంటికే కన్నం వేశారు దొంగలు.. డాగ్ స్క్వాడ్ కు దొరక్కుండా కారం చల్లి వెళ్లిపోయారు.. కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగిరమేష్ ఇంట్లో సోమవారం అర్ధరాత్రి సమయంలో తాళాలు పగులగొట్టి లోపలి వెళ్లారు. రూ. 18 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిన విషయం తెలియగానే ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సీసీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు..

Image result for jogi ramesh

ఎమ్మెల్యే ఇంట్లో చోరీ జరగడంతో అటు పోలీసులు కూడా ఉలిక్కిపడ్డారు. ఎమ్మెల్యే ఇంటికే రక్షణ లేకపోతే తమ ఇళ్లపరిస్థితి ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇది దొంగల పనా లేక తెలిసిన వారే చోరీకి పాల్పడ్డారా అనేది తెలియాల్సి ఉంది. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో చోరీ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరా ఫుటేజ్ సేకరిస్తున్నారు.

వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో చోరీ.. రూ. 18 లక్షల నగదు దోచుకెళ్లిన దుండగులు