నెల్లూరు జిల్లాలో దేవాలయంలో చోరీ

141

దేవాలయాలపై దాడులు, చోరీలు నిత్యకృత్యంగా మారాయి. వరుస దాడులు, దొంగతనాలతో ఆంధ్ర ప్రదేశ్ లో దేవాలయాకు రక్షణ లేకుండా పోయింది. వేసిన తాళాలు తీసి హుండీలను పగులగొట్టి దోచెకెళ్తున్నారు దొంగలు. నెల్లూరు జిల్లాలోని కొడవలూరు మండలం బొడ్డుపాలెంలో పురాతన కోదండరామస్వామి ఆలయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. 2 హుండీలను పగులగొట్టి మొత్తం సొత్తు దోచుకెళ్లారు.

తెల్లవారు జామున పూజ నిమిత్తం దేవాలయానికి వచ్చిన పూజారి డోర్లు తీసి ఉండటాన్ని గమనించి లోపలికి వెళ్లి పరిశీలించారు. రెండు హుండీలు పగిలినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దొంగల కోసం గాలిస్తున్నారు. దొంగతనంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నెల్లూరు జిల్లాలో దేవాలయంలో చోరీ