చిరుతను చంపి వండుకుని తిన్నారు

246

చిరుత పులి మనుషులను చంపి తింది అనే న్యూస్ చదివి ఉంటాం. చంపి వేదిలేసి వెళ్లిన వీడియోస్ కూడా చూసే ఉంటారు. అయితే ఇద్దరు వ్యక్తులు చిరుతపులినే చంపి కూర వండుకొని తిన్నారు. ఈ ఘటన కేరళలో చోటుచేసుకుంది. ఇడుక్కి జిల్లాకు చెందిన 74 ఏండ్ల కురియాకోస్, 45 ఏండ్ల వినోద్‌ కలిసి మునిపారా అటవీ సమీపంలోని మంకులర్‌లో ట్రాప్‌ వేయగా బుధవారం ఒక చిరుతపులి చిక్కింది. దానిని ఇంటికి తీసుకొచ్చిన వినోద్ చిరుతను చంపి మాంసాన్ని వండుకుని తిన్నారు. అయితే ఈ ఇద్దరికీ మరో ముగ్గురు కలిశారు.

54 ఏండ్ల సాలి కుంజప్పన్, 50 ఏండ్ల సీఎస్‌ బిను, 50 ఏండ్ల విన్సెట్ దీనికి సహకరించారు. అటవీశాఖ అధికారులకు ఈ విషయం తెలియడంతో శుక్రవారం వినోద్‌ ఇంట్లో తనిఖీ చేయగా పది కేజీల చిరుత మాంసంతోపాటు దాని చర్మం, గోర్లు, పంటి భాగాలు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

అయితే చిరుతను వండుకొని తిన్న ఘటనలు తమ జిల్లాలో ఎప్పుడు నమోదు కాలేదని ఇడుక్కి పోలీసులు అంటున్నారు. ఇక నిందుతుడు వినోద్ చెబుతున్న వర్షన్ హాస్యాస్పదంగా ఉంది. తన మేకను వేటాడి తినడం వల్లనే తాము చిరుతను చంపాల్సి వచ్చిందని చెబుతున్నాడు. కాగా ఈ ఐదుగురిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు

చిరుతను చంపి వండుకుని తిన్నారు