భార్యను బలవంతంగా మతం మార్చిన భర్త

64

తనను బలవంతంగా మతం మార్చారంటూ ఢిల్లీకి చెందిన 20 ఏళ్ల యువతి, ముస్లిం యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఏడాదిలో మేలో తాము పెళ్లి చేసుకున్నామని. పెళ్ళికి ముందు తన మతం చెప్పకుండా దాచాడని. తనకు కుటుంబం లేదని ఒక్కడినే ఉంటానని తనకు మాయమాటలు చెప్పి మోసం చేసి, ఇప్పుడు కుటుంబ సభ్యులతో కలిసి తనను వేధిస్తున్నాడని పోలీసులకు తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఈ సందర్బంగా బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ తమ ఇంట్లో రెంట్ కి ఉండే ఓ యువకుడు తాను ఒంటరిని అని తనకు కుటుంబం లేదని అబద్దాలు చెప్పి తనకు దగ్గరయ్యాడని. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి తన మతం మార్చారని తెలిపారు. తనను నమాజ్ చెయ్యమని ఒత్తిడి తెస్తున్నారని, అతడి తండ్రి లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని మీడియా ముందు వాపోయింది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్లు కట్నం కోసం వేధించారని, తన తల్లిదండ్రులతో మాట్లాడనివ్వలేదని ఆ యువతి ఆరోపించింది. తనకు ప్రాణహాని ఉందని తెలిపింది.

భార్యను బలవంతంగా మతం మార్చిన భర్త